Header Banner

అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన! పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన.. ఫుల్ షెడ్యూల్ విడుదల!

  Thu Apr 24, 2025 07:50        Politics

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మే 2న రాష్ట్ర రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభించనున్నారు.. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఈ మేరకు ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌‌ను కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్డు షోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.. ఈ రోడ్డు షో 15 నిమిషాలపాటు ఉంటుంది. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ నిర్వహిస్తారు. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తారు. ఆ సభను ముగించుకుని సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. గన్నవరం నుంచి బయల్దేరి 5.20కి బయల్దేరి ఢిల్లీ వెళతారు.

ప్రధాని సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేసి దానిపై 100 మంది ఉంటారు. ప్రధాని సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రజల రాకపోకల కోసం 8 రోడ్లను, 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సభకు రావడానికి వీలుగా ఈ-11, ఈ-13, ఈ-15 రోడ్లతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని CRDA అధికారులను ఆదేశించారు. మంగళగిరి నుంచి రెండు రోడ్లు, తాడేపల్లి నుంచి ఒకటి, వెస్ట్ బైపాస్ నుంచి ఒకటి, ప్రకాశం బ్యారేజి నుంచి రెండు, తాడికొండ నుంచి ఒకటి, హరిశ్చంద్రాపురం నుంచి ఒక రోడ్డు ద్వారా సభా వేదికకు చేరుకోవచ్చని తెలిపారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ప్రధాని పర్యటన కోసం అమరావతి ప్రాంతంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravsi #PMModiInAmaravati #AmaravatiReconstruction #FoundationStone #ModiVisit2025 #AndhraPradesh